నేడు వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వీరి యొక్క స్థితిగతులు పరిశీలించిన ఎన్నో హృదయ విచారకరమైన విషయములు కలవు. వారసులు వృద్ధాప్యమునందు కలలుగని తమ కుమారులు ప్రయోజకులు కావలెనని అహోరాత్రులు కష్టపడి శ్రమించి కష్టపడి తాము ఉపవాసాలు వుండి తమ కుమారులకు కడుపునిండా తిండి, బట్ట, చదువులు చెప్పించి వారి కలలను తీర్చిదిద్ది వారికి ఉన్నతస్థాయికి నిచ్చెనగా మారి వారి కోసమే ఈ జీవితము అని తాము సంపాదించిన ప్రతి పైసా న తమ కుమారులకే చెందాలని ఆరాటపడే తల్లిదండ్రులు ఎందరో!
వీరికి ఆస్తి అప్పగించిన తరువాత వృద్ధులను లెక్కచేయక విచారణకు గురిచేసి భిక్షగాళ్ళకంటే హీనముగా చూచినప్పుడు వారికి కలిగే బాధ చెప్పగలిగినదికాదు. ఎంతో మర్యాదగా బ్రతికినవారు చేతులుచాచి యాచించలేక మానసికంగా బాధపడుతున్న వృద్ధులను మనము నిత్యం చూస్తునే వుంటాము. ఎంతోమంది వృద్ధులు బయటికి చెప్పలేక చాలమంది ఆత్మహత్యలు చేసుకొన్న సందర్భాలు చాలా వున్నాయి. అలాంటి వివాదాలకు గురుయైన వృద్ధులను ఆదుకోవలయునని సత్సంకల్పముతో అనంతపురం జిల్లా. అమడగూరు మండలం. గాజులపల్లి గ్రామంలో నిత్య అన్నదానము, సత్సంగము, ధ్యానము కల్పించి వృద్ధులను ఆదుకోవాలనే సంకల్పముతో మేము శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమము నడుపుచున్నాము.
ఇలాంటివారికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి వృద్దులకు చేయూత
నివ్వాలని మా కోరిక. వృద్ధాశ్రమము అంటే వృద్ధులకు మీరు జీవితంలో ఎన్నో
కష్టాలు ఎదుర్కొని చివరికి ఏమి చేయలేని స్థితిలో వున్నవారు. అలాంటివారికి
మా వృద్ధాశ్రమము చేయూతనిచ్చి వారి బాగోగులను చూసుకొని సదా చివరి దశలోనైన
వారు సంతోషంగా గడపాలని మా కోరిక.
ఉదయం 6-00 గంటలకు బ్రెడ్, కాఫీ, ఉదయం 9-00 గంటలకు టిఫన్, మధ్యాహ్నం 1-00
గంటకు రాగి ముద్ద, అన్నము, పప్పు, మజ్జిగ, రాత్రి 7-15 గంటలకు భోజనము
అరటిపండు ప్రతిరోజు ఇవ్వబడును. అన్నధాన పథకము ప్రారంభించినాము. కావున
దాతలు సహకరించవలెను. అన్నిధానములకన్నా అన్నధానము మిన్న ప్రార్థించే
చేతులు కన్నా అన్నము పెట్టే చేతులే మిన్న. మానవ సేవయే మాధవ సేవ అను మధర్
థెరిస్సాగారి ఆశయ సాధనతో మీ అందరి సహకారముతో అనాధ వృద్ధాశ్రమము అభివృద్ధి
పరచాలని ప్రార్థన.
ఇట్లు,
Bank: State Bank Of India
Account Number: 393210398616
IFSC Code: SBIN0014414
Phone Number: +918978101644 || +919381750414
Phone-Pe Number: +918978101644